చంద్రబాబును ప్రజలు క్షమించరు

ప్రకాశంః చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చిన పాపాన పోలేదని వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ మాధవరావుతో కలిసి పాలూరు గ్రామంలో పర్యటించారు. పెన్షన్లు, రేషన్ లన్నీ జన్మభూమి కమిటీలే నిర్ణయించడం దారుణమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ఈ మూడేళ్లలో బాబు ఒక్క ఇళ్లు కూడ కట్టించింది లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ మేలు చేశారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మా పార్టీ వాళ్లకే మేం ఇచ్చుకుంటామని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా బాబు తన తీరు మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. ప్రత్యేక హోదాను కాలరాసి ప్యాకేజీ పేరుతో బాబు మభ్యపెట్టాలని చూస్తున్నాడని...ప్రజలు ఎవరూ ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు .


Back to Top