జిల్లాకు పైసా కూడ ఇవ్వడం లేదు

వైయస్ఆర్ కడపః

ఎన్నికల ముందు వందలాది హామీలిచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడ నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. స్థానిక 23వ డివిజన్ లోని రాజారెడ్డి వీధి, పోస్టల్స్ క్వార్టర్స్ లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ఎంతమేర ప్రజలకు అందాయో ఆరాతీశారు. ఈ సందర్భంగా ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. డ్వాక్రా రుణాలు మాఫీకాక, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. రేషన్ తొలగించారని, పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు మొరపెట్టుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, తాగునీరు మురికిగా వస్తోందని వీధి ప్రజలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి అమరావతి జపం చేస్తూ వైయస్ఆర్ జిల్లాను విస్మరిస్తున్నారని, జిల్లాకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవని, దాన్ని కూడా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top