పింఛ‌న్లు .. బియ్యం ఏవీ రావడం లేదు

శ్రీకాకుళంః అర్హులకు పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు.. ఉన్న‌వారికి రాజ‌కీయ క‌క్ష‌తో తొల‌గించారు. ఇదేనా చంద్ర‌బాబు పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అని కొండ‌పోల‌వ‌ల‌స‌కు చెందిన మ‌హిళ‌లు, వృద్ధులు వైయ‌స్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఎదుట వాపోయారు. కృష్ణ‌దాస్ ఆధ్వ‌ర్యంలో గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్యక్ర‌మం చేప‌ట్టారు. వితంతువులకు పింఛ‌ను ఇవ్వ‌డం లేద‌ని తుర్ర అప‌ర్ణ‌, రేష‌న్ కార్డులు, పింఛ‌న్లు తొల‌గించార‌ని తుర్ర నారాయ‌ణ‌మ్మ‌, దేవ‌ర పాప‌మ్మ త‌దిత‌రులు  త‌మ గోడును వైయస్సార్‌సీపీ నాయ‌కుల దృష్టికి తెచ్చారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతిమ‌య ప‌ల‌న సాగుతోంద‌ని నీరు - చెట్టు ప‌థ‌కంతో ఇష్టానుసారం దోచుకుంటున్నార‌ని కృష్ణ‌దాస్ మండిప‌డ్డారు.

Back to Top