నవరత్నాలతోనే నవ్యాంధ్ర అభివృద్ధి

చిలకలూరిపేటటౌన్ః నవ్యాంధ్ర అభివృద్ధి నవరత్నాల పథకంతోనే ప్రతిఫలిస్తుందని వైయస్సార్‌సీపి సీనియర్‌ నాయకుడు,మురికిపూడి సొసైటి అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అన్నారు.పట్టణంలోని ఎనిమిదో వార్డులో బూత్‌ కమిటి కన్వీనర్‌ అత్తులూరి షరీఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన వైయస్సార్‌ కుటంబ సభ్యత్వ నమోదు ముగింపోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 650 కుటుంబాలకు చెందిన వారిని వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించినందుకు వార్డు నాయకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ కార్యక్రమాలను ఫోన్‌ ద్వారా ఆయా వార్డు నాయకులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రజల వందలాది సమస్యలను ఏకరువు పెట్టారన్నారు. టిడిపి దుష్ట పాలన అంతమైతేగానీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండలేరన్నారు.పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవిఎం సుభాని,ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మురాజేష్,వార్డు అధ్యక్షుడు షేక్‌ అబూసాలేహ,కౌన్సిలర్‌ సాపా సైదావలి,కరిముల్లా,అన్వర్‌బాషా,మొహ్మద్‌ రఫి,సిద్దిఖ్,అజారుద్దీన్,పాషా,హనీఫ్‌ ఉన్నారు.

Back to Top