బాబు పాలనకు చరమగీతం పాడుతాం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తమ ఇంటికి వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. బాబుకు ఓటేసినందుకు తమను నట్టేట ముంచాడని ప్రజలు నేతల వద్ద వాపోయారు. 


బాబు వస్తే జాబొస్తుందన్నారు.  లేనిప‌క్షంలో రూ. 2 వేల నిరుద్యోగ భృతిని అంద‌జేస్తాన‌ని చెప్పారు.  బాబుకు జాబు వచ్చింది గానీ రెండేళ్లుగా తమకు మాత్రం ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు వాపోతున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. పైసా కూడా ఇవ్వడం లేదని యువ‌త చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మాట్లాడుతూ... చంద్ర‌బాబు దుర్మార్గాల‌కు త్వ‌ర‌లోనే చ‌ర‌మ‌గీతం పాడ‌తామ‌న్నారు. 

తాను అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలన్నీ మాఫీ చేస్తాన‌న్న చంద్ర‌బాబు క‌ల్ల‌బొల్లి మాట‌లు న‌మ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను బాబు దగా చేశారని నేతలు ఈసందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top