గిరిజనులను ఆదుకోవడంలో సర్కార్‌ విఫలం

సీతంపేట:  గిరిజనులను ఆదుకోవడంలో తెలుగు దేశం ప్రభుత్వం విఫలమైందని
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట
వారపు సంతలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
సందర్బంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థ ఉన్నా గిరిజనులు సేకరిస్తున్న
అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. ఈ సీజన్‌లో లభించే కొండచీపుర్లు, పైనాపిల్‌ ఇతర ఉత్పత్తులను  దళారీలకే
విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.  గూడెలలో
తాగడానికి మంచినీరు అంద‌క కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు పింఛన్లు అందడం లేదని విమర్శించారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఎస్‌.లక్ష్మి, సర్పంచ్‌ ఎస్‌.గోపాలు, ఎంపీటీసీ బి.జయలక్ష్మి, పార్టీమండల కన్వీనర్‌ జి.సుమిత్రారావు, మహిళా విభాగం అద్యక్షురాలు ఎ.కళావతి, యూత్‌ కన్వినర్‌ హెచ్‌.మోహన్‌రావు,  మండలకోఆప్షన్‌ సబ్యుడు ఎం.మోహన్‌రావు, పీసాచట్టం ఉపాద్యక్షుడు ఎన్‌.సోమయ్య, పార్టీనేతలు బి.పకీర్, జిబ్బెందొర, ఎస్‌.చంద్రశేఖరరావు, కృష్ణవేణి, గణేష్,  తదితరులు పాల్గొన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top