స‌మ‌స్య‌ల వెల్లువ‌

ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో స‌మ‌స్య‌లు వెల్లువెత్తాయి. ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ తూమాటి మాధవరావు గూడ్లురు మండలంలోని రాజుపాలెం పంచాయ‌తీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భఃగా ఇంటింటా ప్రజా బ్యాలెట్ ద్వారా చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో,  అధికారం లోకి వచ్చిన తర్వాత ఎలా మాట మార్చారో వివరించారు..ప్రజలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తమ ఓటు తో బుధ్ది చెప్పాల‌ని మాధ‌వ‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో గూడ్లురు జెట్పిటిసీ వెంకట్ రామిరెడ్డి, కందుకూరు రూరల్ యూత్ అధ్యక్షులు   కోటేశ్వర రావు, గూడ్లురు కన్వీనర్  కృష్ణ, గూడ్లురు ప్రచార కమిటీ కన్వీనర్   మధు, యూత్ కన్వీనర్   కిశోర్,  య.సి సెల్ కన్వీనర్ శ్రీ మేతూషల , కృష్ణా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
- టెక్కలి నియోజకవర్గo, నందిగామ‌ మండలం , చిన్నగురువూరు, మాలియలింగుపురం గ్రామం లో వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్‌ పేరాడ తిలక్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
- క‌ర్నూలు న‌గ‌రంలోని మూడో వార్డులో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ హ‌ఫీజ్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.
- శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుడ్డా శేషారెడ్డి సున్నిపెంటలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు.Back to Top