అంతా విదేశాల‌కే అంకితం

నెల్లూరు :  మొత్తం భూముల‌న్నీ విదేశాల‌కు అప్ప‌గించాల‌న్న‌ది ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప‌రిపాల‌న తీరు అని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి నిప్పులు చెరిగారు.  మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తాలిచర్లపాడులో కాకాణి గోవర్దన్రెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని విదేశీయులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజలే చంద్రబాబును నిలదీస్తారని ఆయన పేర్కొన్నారు.
Back to Top