విస్తృతంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

ప్ర‌కాశం: గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు విస్తృతంగా నిర్వ‌హిస్తున్నారు. గురువారం య‌ర్ర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గం త్రిపురాంత‌కం మండ‌లం వెంగాయ‌పాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.


 చీరాల నియోజ‌క‌వ‌ర్గం వేటపాలెం మండలం నాయినిపల్లి గ్రామంలోని చిన్నబ‌జార్లో గురువారం గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త య‌డం బాలాజీ ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా బ్యాలెట్ పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ మండల అధ్యక్షులు కోలుకుల వెంకటేశ్ , త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top