వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాష్ట్రాభివృద్ధి

జియ్యమ్మవలసః  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ది సాధ్య‌మ‌ని పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆర్నిపల్లి వెంకటనాయుడు అన్నారు. గురువారం  వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న  మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌ కుటుంబంతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని. వచ్చే ఎన్నికలలో వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కార్యకర్తలంతా క‌ష్ట‌ప‌డాల‌న్నారు. వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా భూత్‌ కమిటీ సభ్యులు పాల్గొని 50 ఇళ్ల‌కు వెళ్లి న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌చారం నిర్వ‌హించారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ గూనగంజి చంద్రయ్య, మరడాన కిశోర్, టొంప లక్ష్మణయాదవ్, రాయగడ శేఖర్, మరడాన ధనుంజయనాయుడు, సువ్వాన సింహాచలంనాయుడు, బోను శివున్నాయుడు, నరాల షన్ముఖరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top