<strong>విజయనగరం(కురుపాం)జియ్యమ్మవలస</strong>: చంద్రబాబు ఎన్నికలకు ముందు తీరని హామీలిచ్చి గెలిచిన తరువాత మరిచారని కురుపాం ఎమ్మెల్యే పాము పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని చింతలబెలగాం పంచాయతీ దత్తివలస, రాజయ్యపేట గ్రామాల్లో గడపగడపకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దత్తివలసలో 128 గడపలు, రాజయ్యపేటలో 73 గడపలకు వెళ్లి చంద్రబాబు ప్రజలను మోసం చేసిన విధానాన్ని వివరించారు. అనంతరం ప్రజాబ్యాలెట్‌లను పంచారు. ఈ సందర్బంగా మహిళలు తమ కష్టాలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. <br/><strong>వినుకొండ టౌన్</strong>: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో గడపగడపకు వైయస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకుడు బేతం శ్యాం ప్రసాద్‌తోపాటు 25మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొల్లా బ్రహ్మనాయుడు బేతం శ్యామ్ దంపతులకు పార్టీ కండువాలు కప్ప వైయస్‌ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం బేతం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను దగా చేశారని, దీంతో మనస్థాపం చెంది బొల్లా నాయకత్వంలో నియోజకవర్గంలో కార్యకర్తగా పనిచేయడానికి పార్టీ మారినట్లు తెలిపారు. ముందుగా ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. <img src="/filemanager/php/../files/Viswa/untitled%20folder/gadapa2/gadapa33/unnamed%20(13).jpg" style="width:716px;height:538px"/><br/>