మోసపూరిత పాలనకు కాలం దగ్గర పడింది

స‌మ‌స్య‌ల‌పై స్పందించేవారేరి?
మ‌ల్కాపురం(విశాఖ వెస్ట్‌):  విషజ్వరాలు ప్రబలుతుంటే అధికారులు గానీ, నాయ‌కులు గానీ త‌మ వంక చూడ‌టం లేద‌ని 49వ వార్డు త్రినాథ్‌పురం కొండ‌వాలు ప్రాంత మ‌హిళ‌లు వైయ‌స్సార్‌సీపీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త. మాజీ ఎమ్మెల్యే మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానికంగా పర్య‌టించారు.  వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు పాలనపై మార్కులు వేయించారు. బాబుపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఓట్లకోసం అబద్ధపు హామీలిచ్చి బాబు తమను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అప్పుల ఊబిలో కూరుకుపోయాం
అచ్యుతాపురం(య‌ల‌మంచిలి): గ‌గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎర్ర‌వ‌రం రైతులు చంద్ర‌బాబు పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. పాత అప్పులు తీర‌లేదని, కొత్త అప్పులు పుట్ట‌డం లేద‌ని బాబు చెప్పిన రుణమాఫీ మొత్తం బుట‌క‌మ‌ని వారు మండిప‌డ్డారు.  య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో ఎర్రవరం  గ్రామంలో గడపగడపకూ కార్యక్రమం కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌కు కాలం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని అన్నారు. 2019లో  వైయ‌స్సార్‌సీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top