బాబు రుణమోసం

అనంతపురం అర్బన్)) మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ గుర్నాథరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శివాలయం వీధిలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. ప్రతీ గడపలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని గుర్నాథరెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదని ప్రజలే స్వయంగా తమకు చెబుతున్నారని గుర్నాథరెడ్డి తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోగా అసలుతో పాటు వడ్డీమీద వడ్డీ కట్టి మహిళలు అప్పులపాలైన పరిస్థితి నెలకొందన్నారు. ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.2వేల భృతి ఇలా అనేక మోసపూరిత హామీలు గుప్పించి బాబు మోసం చేశారని గుర్నాథరెడ్డి ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో బాబుకు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 


Back to Top