మోసపూరిత ముఖ్యమంత్రి

ప్రజా సంక్షేమం విస్మరించిన బాబు
కృష్ణాజిల్లా (జగ్గయ్యపేట))చంద్రబాబు ప్రజల సంక్షేమం మరిచారని, తమకు సంక్షేమ పథకాలే అందడం లేదని జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామస్తులు వాపోయారు. రుణమాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లేశామని, పైసా మాఫీ చేయకుండా బాబు తమను మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను చిల్లకల్లులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పింఛన్లు రావడం లేదని, ఇళ్లకు అర్జీ పెట్టుకున్నా మంజూరు కావడం లేదని పలువురు సామినేని వద్ద వాపోయారు. నమ్మించి మోసం చేసిన బాబుకు మీరే తగిన బుద్ధి చెప్పాలని ఉదయభాను ప్రజలకు పిలుపునిచ్చారు. 

దళిత వ్యతిరేక ప్రభుత్వం
కైకలూరు))తాగేందుకు గుక్కెనీళ్లు లేవు. పక్కా ఇళ్లు మంజూరు కావడం లేదు. పించన్లు, రేషన్ లు రావడం లేదు. ఎస్టీలనే కారణంతో ప్రభుత్వం తమపై వివిక్ష చూపుతోందని పలువురు వైయస్సార్సీపీ నేతల వద్ద మొరపెట్టుకున్నారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముదినేపల్లి మండలం కోరుకల్లు రోడ్డులోని ఎస్టీ కాలనీలో గడపగడపకూ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబు దళిత వ్యతిరేకని డీఎన్నార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రెండున్నరేళ్లలో చేసింది శూన్యం
తూర్పుగోదావరి(ముమ్మ‌డివ‌రం))టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించుకున్న ఇళ్ల‌కు బిల్లులు ఇవ్వడం లేదని అనంత‌వ‌రం వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముమ్మడివరం మండలంలోని అనంతవరం శివారు మ‌ట్ట‌ప‌ర్తివారిపాలెం, గుబ్బ‌ల‌వారిపాలెం, మిమ్మిర్తివారిపేట‌లో నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ కోఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరిగి ఎన్నిక‌ల హామీల అమ‌లులో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లే మార్కులు వేయాల‌ని సూచించారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.  


Back to Top