అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేశారు

వించిపేటః అధికారంలోకి వచ్చాముకదా  ఏం చేసినా చెల్లుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచిపోయి తన ఇష్టారాజ్యంగా సంక్షేమ పధకాలకు తూట్లుపొడుస్తున్నారని పలువురు మహిళలు వైయస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు, పశిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్ధానిక 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ బీజాన్‌బి, వైయస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ నగర అధ్యక్షుడు గౌస్‌మోహిద్దిన్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గడప గడపకు వైయస్సార్‌ సీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి డివిజన్‌లోని కోప్పులవారివీధి, కట్టావారివీధి, బడెసాహేబ్‌వీధి, ఉమర్‌అలీషావీధి, లక్ష్మయ్యవీధుల్లో పర్యటించి స్ధానికులతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఉన్న డ్వాక్రా సంఘాలనే రద్దుచేస్తున్నారని పలువురు మహిళలు వాపోయారు. డివిజన్‌లో ఏ వీధిలో చూసినా డ్రెయినేజీ వ్యవస్ద తీవ్ర అధ్వాన్నంగా ఉందని, సైడు కాలువల్లో మురుగుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్ధానికులు వాపోయారు. మా సమస్యలను పరిష్కారిస్తారనే నమ్మకంతో వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యేగా జలీల్‌ఖాన్‌ను అత్యదిక మెజార్టీతో గెలిపిస్తే, మా సమస్యలు తీర్చాల్సిందిపోయి ఆయన వ్యక్తిగత లాభం కోసం పార్టీ ఫిరాయించి మా సమస్యలను గాలికోదిలేశారని వించిపేటలోని పలువురు ముస్లీం మైనార్టీలు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ... జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోతో ఎన్నికల్లో గెలిచిన జలీల్‌ఖాన్‌ తన స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసమే పార్టీ ఫిరాయించానని చెప్తున్న జలీల్‌ఖాన్‌ నియోజకవర్గ అభివృద్దికి ఏంచేశావని ప్రశ్నించారు. కేవలం మంత్రిపదవి ఆశించి టిడిపి తీర్ధం పుచ్చుకున్నప్పటకి ఆయన నిజాయితీ మీద నమ్మకంలేక మంత్రివర్గంలో చోటు దక్కలేదని విమర్శించారు. అనంతరం ఎన్నికల్లో టిడిపి ముద్రించిన అసత్య హామీల పత్రాలను ప్రజలకు పంపిణిచేస్తు వారిని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ రాష్ట్ర కార్యదర్శి పైలా సోమినాయుడు, పార్టీ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, కార్పోరేటర్‌ జమ్మలపూర్ణామ్మ, పార్టీ నాయకులు ఏనుగుల సునీల్‌కుమార్, పటాన్‌ ఇమామ్, వాజీద్‌ఖాన్, షేక్‌ నాహీద్, మధిర ప్రభాకర్, బోబ్బిలి లీలాప్రసాద్, బోమ్మల శ్రీను, ఏనుగుల శ్రీను, రవి, తిరుమలరావు, మస్తాన్‌రావు, ఖాఆదర్‌బాషా,మెహాముద్, వడ్డాది సురేష్‌ తదితరులు పాల్గోన్నారు.

Back to Top