తాడేపల్లి: మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. `మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.