బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు

తనకల్లు (అనంత‌పురం): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త డాక్ట‌ర్ సిద్ధారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాసినేపల్లిలో శుక్రవారం నిర్వహించిన వైయ‌స్ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిద్ధారెడ్డి మాట్లాడుతూ   రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినవరత్నాలు పథకాలను ప్రవేశపెట్టార‌న్నారు.  ప్రజలను దగా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగినవిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌కు మద్ధతుగా నిలవాలని ఇంటింటా తిరుగుతూ విజ్ఞప్తి చేశారు. వైయ‌స్‌ జగన్ ముఖ్యమంత్రి కాగానే నవరత్నాలు ప్రతి ఇంటికీ అందుతాయని భరోసాను ఇచ్చారు.  కార్య‌క్ర‌మంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, ఆదెప్పనాయుడు, మనోహర్నాయుడు, రామాంజులరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
----------------------------------
న‌వ‌ర‌త్నాలుతోనే న‌వ స‌మాజం
ఆత్మ‌కూరు (అనంత‌పురం):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలుతోనే న‌వ స‌మాజం సాధ్య‌మ‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ వ‌డ్డుప‌ల్లి న‌ర‌సింహారెడ్డి అన్నారు. చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.  వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్రవారం ఆయ‌న మండలంలోని ముట్టాల , గొరిదిండ్ల , సింగంపల్లి , సనప, రంగంపేట, వేపచెర్ల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు . ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహారెడ్డి మాట్లాడుతూ నవ రత్నాలలో రుణ మాఫీ, రెండు వేలు ఫించెన్ , ఫీజు రిమెంబర్స్మెంట్ , డ్వాక్రా రుణాలు మాఫీ, ఇలాంటి తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టారని తెలియచేశారు . రైతు రుణాలు మాఫీ ,ఇంటింటికో ఉద్యోగం , డ్వాక్రా రుణాలు మాఫీ నిరుద్యోగ భృతి వంటి ఆశలు కల్పించి ప్రజలను నిలువునా మోసం చేశారని తెలియచేశారు . అనంతరం ఫోన్ ద్వారా 9121091210 కుఫోన్ చేసి వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్చారు. అంతేకాకుండా చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాల గురించి వారి ద్వారానే తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సింగల్ విండో ప్రసిడెంట్ వాసుదేవరెడ్డి , ముత్యాలరెడ్డి, మాదన్న, గొవింద్ , భూత్ కమిటీ కన్వీనర్లు , కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Back to Top