బాబువి మాటలే తప్ప చేతల్లేవ్

న‌మ్మి మోస‌పోయాం
ఎన్నిక‌ల‌కు ముందు భూమిలేని ప్ర‌తి ఒక్క గిరిజ‌న కుటుంబానికి రెండెక‌రాల సాగుభూమి ఇస్తాన‌ని చెప్పిన చంద్రబాబు... సెంటు భూమి కూడా ఇవ్వకుండా మోసం చేశార‌ని జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం మ‌క్క‌పేట గ్రామం ఎస్టీ కాల‌నీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సామినేని ఉద‌య‌భాను ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వంద ప్ర‌శ్నాల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అందించి వారితో మార్కుల‌ను వేయించారు. బాబు పాలనకు ప్రజలు సున్నా మార్కులు వేశారు.

మాట‌లు మాత్ర‌మే చేత‌ల్లేవ్‌...
మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని... అధికారంలోకి వ‌చ్చాక బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్ర‌జ‌లు మండిపడ్డారు . వైయస్సార్సీపీ నేత ఆకుల వీర్రాజు  కడియం మండలంలో గడపగడపలో పర్యటించారు.  డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాన‌న్న చంద్ర‌బాబు పైసా కుడా మాఫీ చేయకుండా మొహం చాటేశార‌ని  మ‌హిళ‌లు ఈసందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర‌బాబును న‌మ్మి ఇంకెప్పుడు మోసపోయే పరిస్థితి రాదని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top