బాబు హ‌యంలో ఏపీ అవినీతిలో నెంబ‌ర్ వ‌న్‌

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్రమంలో ఎమ్మెల్యే కాకాణి, అనిల్‌కుమార్ యాద‌వ్‌
నెల్లూరు:  విభ‌జ‌న‌తో అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని అభివృధ్ధి చేకుండా అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ చేసిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకు ద‌క్కింద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షులు కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఆరోపించారు. మంగ‌ళ‌వారం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి కాకాణి గోవ‌ర్థ‌న్ హ‌జ‌ర‌య్యారు. న‌గ‌రంలోని మూడ‌వ వార్డులో చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల‌తో మార్కులు వేయించారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ స‌ర్కార్ పాల‌న‌పై వైయ‌స్సార్‌సీపీ సంధించిన వంద ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నాయ‌కులు స‌మాధానం చెప్ప‌లేక ప్ర‌తిప‌క్షంపై ఎదురుదాడికి దిగుతున్నార‌ని మండిప‌డ్డారు. బాబు రెండేళ్ల పాల‌న‌లో అభివృద్ధి శూన్య‌మ‌న్నారు. ప్ర‌జ‌లు దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శ‌ఖ‌ర‌రెడ్డి పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని, ఆ పాల‌న వైయ‌స్సార్ త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ వ‌ల్లే సాధ్య‌మ‌న్నారు. 
Back to Top