ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై బాబు వివక్ష

నెల్లూరుః రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సౌత్ మోపూరు, మొగళ్లపాలెం గ్రామాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాసమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు ఎమ్మెల్యేలకిచ్చే గ్రాంట్ ను తీసేయడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఎమ్మెల్యేల గ్రాంట్ రద్దు చేయడం ముఖ్యమత్రికి తగదని, తక్షణమే గ్రాంటు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపడం తగదని బాబుకు హితవు పలికారు. ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోవడంతో ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Back to Top