న‌మ్మిన ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన బాబు

గడపగడపలో వైయస్సార్సీపీ నేతల పర్యటన
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మున్ముందుకు
అధైర్యపడొద్దని మేమున్నామని భరోసా
మోసపూరిత టీడీపీని తరిమికొట్టాలని పిలుపు

చిత్తూరు(నగరి):ఎన్నిక‌ల స‌మ‌యంలో వందలాది హామీలు గుప్పించి  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...వాటిని పూర్తిగా విస్మ‌రించార‌ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వంపై మండిపడ్డారు. గడపగడపకూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆమె విజయపురం మండలంలోని ఆలపాకం, ఆలపాకం కండ్రిగ, ఆలపాకం వడ్డిండ్లు, ఎస్టీ కాలనీ, ముత్తప్పరెడ్డి కండ్రిగ, ఎల్లసముద్రం, మాధవరం, మాధవరం దళితవాడల్లో పర్యటించారు. ప్రతి గడపకూ వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు వినడానికే మీ గడపకు వచ్చా అవ్వా.. అమ్మా.. అన్నా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై, ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. పక్కా గృహాలు, పింఛన్లు, డ్వాక్రా రుణాలు తదితర సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. మోసం చేసిన టీడీపీని త‌రిమి కొట్టాల‌ని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. 



మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
వైయస్సార్సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి
క‌ర్నూలు జిల్లా) ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికార పక్షం  విఫలం చెందిందని వైయ‌స్ఆర్సీపీ జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.   జీ.ఎర్రగుడి గ్రామంలో చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమంలో  అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 

‘నాకు రెండు కళ్లూ కనిపించవు. నడవడానికి కూడా చేతకాదు. నా అన్న వారు ఎవరూ లేరు. ఎక్కడో ఒక చోట ఇంత ముద్ద తిని ఒంటరిగా బతుకున్నా. చాన్నాళ్లుగా రూ.200 పింఛన్‌ వచ్చేది. వెయ్యి రూపాయలు పెరిగినప్పటి నుంచి రావట్లేదు. బియ్యం కార్డులో వయస్సు 18 ఏళ్లు పడిందని తీసేశారు. వచ్చే రెండొందల పింఛన్‌ కూడా తీసేశారు. ఎలా బతకాలి’ అంటూ 85 ఏళ్ల చిన్న హనుమంతు(రోగెన్న) తన వేదనను వినిపించారు.  రెండేళ్లలో ఏమీ లబ్దిపొందక పోగా నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు చుక్కలు తాకుతున్నాయని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 

మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రజలను నట్టే ముంచారని అనంత ఫైర్ అయ్యారు. చంద్రబాబు, మంత్రులు, వారి అనుచరులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుధ్ది చెప్పాలని కోరారు. 
Back to Top