పేదల కడుపు కొట్టి రాజకీయ రంగు పూస్తారా..?

  • బాబు నీ దోపిడీని అడ్డుకుంటే రాక్షసులమా..?
  • ఉపాధి నిధులను పచ్చచొక్కాలకు దోచిపెట్టావ్
  • పేదలకు మీరు అన్యాయం చేసి మాపై బురదజల్లుతారా
  • ఇలాంటి కుట్రలు బాబుకు అలవాటే..?
  • టీడీపీ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు
  • బాబు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు
  • బాబుకు చిత్తశుద్ధి ఉంటే నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి
  • వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్ః చంద్రబాబు ఉపాధి హామీ నిధుల్ని పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తే...నిధులు రాకుండా అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు ప్రతిపక్ష నేతపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు.  నిధులు ఆపమని తాము ఎక్కడ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసిన కాపీలను మీడియా ముఖంగా వైవీ చూపించారు. తాము ఏనాడు అభివృద్ధికి అడ్డుకాదని, అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఉపాధిహామీ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వమే చెప్పిందని, ఉపాధి నిధుల అమలును కాగ్ కూడ తప్పుబట్టిందని వైవీ గుర్తు చేశారు. టీడీపీ దోపిడీని అడ్డుకుంటే మేం రాక్షసులమా..? పేదల కడుపు కొడుతూ ఉపాధి నిధులను మింగేస్తున్న పాలకులే రాక్షసులని వైవీ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఎన్ఆర్జీఈఎస్ కింద గత ప్రభుత్వంలో చేసిన పనులకి బిల్స్ ఆపేయడంతో పాటు హౌసింగ్ ఫండ్స్ కూడ నిలిపేయాలని  బాబు అధికారంలోకి రావడంతోనే 2014 ఆగష్టు 12న జీవో జారీ చేశారని, ఇంతకన్నా దారుణం ఏముంటుందని వైవీ ప్రశ్నించారు.  

ఎన్ఆర్జీఈఎస్ పేరు చెప్పి కూలీలకు డబ్బులు అందకుండా మిషన్ ల ద్వారా పనులు చేసి ఆ పథకాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని వైవీ మండిపడ్డారు. పేదలకు అందాల్సిన నిధులను  జన్మభూమి కమిటీల ద్వారా పచ్చచొక్కాలకు అప్పజెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి నిధులు  దుర్వినియోగం చేస్తున్నారని రూరల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన మినిస్టర్ కు, నీతి ఆయోగ్ చైర్మన్, ఆ తర్వాత అప్పటికీ చర్యలు తీసుకోకపోతే ప్రధానికి లేఖ రాశానని వైవీ గుర్తు చేశారు. ఎన్ఆర్జీఈఎస్ ఫండ్స్ ఏం సంవత్సరంలో ఎంత దుర్వినియోగం అయ్యాయో స్పష్టంగా తెలిపామని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల వారి కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని పచ్చచొక్కాలు దుర్వినియోగం చేస్తుంటే చూస్తు ఊరుకోవాలా...?ఫిర్యాదు చేస్తే మేము రాక్షసులమా..? రాష్ట్రాన్ని దోచుకుంటుంది మీరు. రాష్ట్రాభివృద్ధి పేరుతో  అమరావతి, పట్టిసీమను దోపిడీ చేశారు.  అభివృద్ధి పేరుతో మీరు చేస్తున్న అవినీతికి అడ్డుపడుతూనే ఉంటాం. పార్లమెంట్ సాక్షిగా ఉపాధి నిధులపై డిస్క షన్ జరిగింది. పశ్చిమబెంగాల్ కు చెందిన కళ్యాణ్ అనే ఎంపీ అడిగిన ప్రశ్నకు ...రిప్లైలో ఏపీ నుంచి 14 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇవన్నీ మీకు తెలియదా బాబూ...? చేసిందంతా మీరు చేసి జగన్, ఆయన బంధువులు, ఎంపీలు నిధులకు అడ్డుపడుతున్నారంటూ రాజకీయ రంగు పూసే కార్యక్రమం చేస్తారా అంటూ బాబుపై వైవీ ధ్వజమెత్తారు. మీ అవినీతిని విమర్శిస్తే  దాన్ని మసి పూసి మారేడు కాయ చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ మాట్లాడుతారా..? ముఖ్యమంత్రి స్థాయికి నీకిది తగునా..?  ప్రజలను ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు. పేదల కడుపు కొడుతూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాపై బురద జల్లుతారా అంటూ చంద్రబాబుపై వైవీ నిప్పులు చెరిగారు. 


వైయస్ఆర్ హయాంలో ప్రతి ఏడాది 10లక్షల ఇళ్లు కట్టించారు.  ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టించారు బాబూ..? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదవాళ్ల ఇళ్లు ఆపమని జీవోలెందుకు ఇస్తారు. మీరు ఇచ్చిన జీవో కారణంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లు కూడ ఆగిపోయాయి.  పేదవాడికి మీరు అన్యాయం చేస్తూ ప్రతిపక్ష నాయకుడు , ఎంపీల మీద బురదజల్లే ప్రయత్నం చేయడం సబబేనా బాబూ. ..?ఎన్ఆర్జీఈఎస్ ఫండ్స్ విషయంలో అవకతవకలు జరిగిందనడానికి సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయి కాబట్టే మంత్రికి ఫిర్యాదు చేశాం. ఈసంవత్సరం పనుల్లో కూడ అవకతవకలు జరుగుతున్నాయి. 146కోట్ల అవినీతి జరిగిందని కాగ్ కూడ తప్పుబట్టింది. ఇంత ఘోరంగా ప్రభుత్వం ఉండి.... అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ మామీద కరపత్రాలు ముద్రించి ఊరూరా పంచమని చెబుతారా..? బాబూ మీ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడెప్పుడు టీడీపీ పాలనకు చరమగీతం పాడాలా అని ఎదురుచూస్తున్నారు.  బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఉపాధి నిధుల్లో జరిగిన అవకతవకలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top