ఏలూరులో యువభేరి

పశ్చిమగోదావరి(ఏలూరు))పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో రేపు యువభేరి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.  హోదా వల్ల కలిగే ప్రయోజనాలను యువత, విద్యార్థులకు వివరించనున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా ఈ యువభేరి నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది యువతే..ఆ విషయాన్ని యువతకు వివరించి, పోరాటంలో విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. 
Back to Top