పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభధ్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసన మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ డెమక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌)కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు గురువారం పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీలు ఎంవీఎస్‌ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఇందుకు వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.  తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, టీచర్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాలసుబ్రహ్మణ్యంకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ప్రకటించింది. అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అజయ్‌ శర్మకు మద్దతిస్తున్నట్లు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు వీరి గెలుపునకు కృషి చేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

Back to Top