యువనేస్తం అంతా బోగస్‌

 
విజయవాడ: చంద్రబాబు ప్రకటించిన  యువనేస్తం పథకం అంతా బోగస్‌ అని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి మండిపడ్డారు. ఏడాదికోసారి డీఎస్సీ అని నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా మోసం చేసి ఎన్నికలు వస్తున్నాయని 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని ధ్వజమెత్తారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మెగా డీఎస్సీ నిర్వహించి 50 వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. బాబు మాత్రం నిరుద్యోగులపై పోలీసులతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షరత్తులు పెట్టి నిరుద్యోగులను నిలువునా చంద్రబాబు మోసం చేశారని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తారని చెప్పారు. 
 
Back to Top