పవన్‌ ఎందుకు పోటీ చేయలేదు?



– ప్రత్యేక హోదా కోసం ఆత్మ బలిదానాలు బాధాకరం
– ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే
– రాజ్యసభ సీటు ఇవ్వలేదనే టీడీపీ నుంచి బయటకు వచ్చారా?
– రివాల్వర్‌తో కాల్చుకొని చావాలనుకున్న పవన్‌ «ధైర్యవంతుడా? 
– ఓటుకు కోట్లు కేసు విషయంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?
హైదరాబాద్‌: ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగాలని చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌ 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజారాజ్యం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఏమయ్యారని ఆయన నిలదీశారు. అధికార పార్టీని వదిలి, ప్రతిపక్ష పార్టీని విమర్శించడం సరికాదన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చేందుకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా గతంలో తిరుపతిలో మునికోటి అనే యువకుడు నిప్పంటించుకొని బలవన్మరణం పొందారన్నారు. ఏపీ బంద్‌ సందర్భంగా ఈ నెల 24వ తేదీ పోలీసులు అరెస్టు చేయడంతో కాకి దుర్గారావు గుండె ఆగిపోయిందన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా మదనపల్లెలో సుధాకర్‌ అనే యువకుడు ప్రత్యేక హోదాను డిమాండు చేస్తూ బలవన్మరణం పొందారు. ఈ మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు కావని, ప్రత్యేక హోదా ఇస్తామని ఈ ప్రభుత్వాలు మోసం చేయడం వల్ల ఇవి హత్యలని నైతికంగా భావించాల్సి ఉంటుందన్నారు. సుధాకర్‌ ఆశయం నెరవేరాలని, తుదకంటూ పోరాడుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతుందని, ఈ సందర్భంగా సుధాకర్‌ మరణానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నివాళుల్పిస్తోంది.
– రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నించేసిన భాగస్వామ్యపార్టీలు ఒక్కొక్కటిగా చీలిపోయాయన్నారు. టీడీపీతో నాలుగేళ్లు కలిసి పని చేసిన జనసేన పార్టీ విడిపోయి బయటకు వచ్చిందన్నారు. కానీ టీడీపీకి బదులు ప్రధాన ప్రతిపక్షాన్ని పవన్‌ విమర్శిస్తున్నారన్నారు. అధికార పక్షాని కన్నా మించిన విమర్శలు వైయస్‌ జగన్‌పై, వైయస్‌ఆర్‌సీపీపై చేస్తున్నారన్నారు. ఇవి సంప్రదాయానికి విరుద్ధమైన అంశమన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తానే ఉత్తముడినని పవన్‌ చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు అవినీతి చేస్తూ తాను నిప్పు అని చెప్పుకుంటున్నట్లు పవన్‌ తానే ఉత్తముడినని సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుండాయిజం, కత్తులు, బాంబులు అన్నీ కూడా మా సంస్కృతి అన్నట్లుగా పవన్‌ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు దెబ్బకు తట్టుకోలేక మేం పారిపోయినట్లుగా పవన్‌ విమర్శలు చేయడం సరికాదన్నారు. మా స్థానంలో ఆయన ఉంటే ఒక ఊపు ఊపేసేవాడినని చెప్పుకుంటున్నారన్నారు. 
– పవన్‌ కళ్యాణ్‌..మీకు మా స్థానం కావాలని ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పది అసెంబ్లీ సీట్లు ఉంటే..అసెంబ్లీలో గందరగోళం చేయాలనే తాపత్రయం నిజంగా పవన్‌కు ఉండి ఉంటే 2014లో చంద్రబాబును, టీడీపీని ఉత్తుత్తినే ఎందుకు సపోర్టు చేశారని ప్రశ్నించారు. మీకు బలం ఉన్న చోట ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. మీది కూడా ఒక రాజకీయ పార్టీ అయితే అసెంబ్లీకి వెళ్లి ఊపేయాలన్న దృక్ఫథం ఉంటే ఎందుకు పోటీ చేయలేదన్నారు.
– ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ తనకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానని మాట ఇచ్చారని ఆయన చేప్పారన్నారు. ఓట్లు చీలిపోతాయని, అలా వద్దు , రాజ్యసభ సీటు ఇస్తానంటే పోటీ నుంచి తప్పుకున్నారా? అందుకే ఇవాళ టీడీపీ నుంచి బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. 
– నేను చాలా ధైర్యవంతుడిని అని పవన్‌ చెప్పుకుంటున్నారని, అలాంటి ధైర్యం ఉంటే ఎందుకు పోటీ చేయలేదన్నారు. నిన్న భీమవరంలో నిర్వహించిన సభలో ఓ విద్యార్థి  పవన్‌ను ప్రశ్నిస్తే..పవన్‌ సమాధానం చెబుతూ..ఒకానోక సందర్భంలో చాలా ప్రెస్టేషన్‌లో ఉన్నానని, రివాల్‌వర్‌తో కాల్చుకొని చనిపోవాలనుకున్నానని చెప్పారన్నారు. కాల్చుకునే మీరు «ధైర్యవంతులా? పిరికివారా ఒక సారి సైక్రాసిస్ట్‌ను కలవాలని సూచించారు.
– ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు 222 సీట్లకు పోటీ చేశారని, 18 సీట్లు గెలుచుకుని ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. ఎవరి మీద ఫైట్‌ చేశారు, పారిపోయారా? లొంగిపోయారా? చేరిపోయారా? ..ఆ రోజు ఏమయ్యారని ఆయన నిలదీశారు. ప్రజా సేవ చేయాలని, అసెంబ్లీకి వెళ్లాలని కోరిక ఉంటే ఆ రోజు ఎందుకు పోటీ చేయలేదన్నారు. ఆ రోజు చేయలేని మీరు..ఈ రోజు చేస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారని మండిపడ్డారు. ఎవరిని ప్రశ్నించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోతే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఆ రోజు ఏం అడ్డమొచ్చిందన్నారు. విజయవాడ నడిబొడ్డున కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని, నలుగురిని మంత్రులుగా చేస్తే ఎందుకు పవన్‌ ప్రశ్నించలేదన్నారు. అది తప్పు కదా? అన్యాయం కాదా? మమ్మల్నే ప్రశ్నిస్తావా అని ఫైర్‌ అయ్యారు. 
 
Back to Top