వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

కర్నూలుః పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాటు పడ్డార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవా స‌మితి నాయకురాలు స‌ఫియా ఖాతూస్ అన్నారు. జిల్లాలోని బంగారుపేట‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో.... ఆమె 150 మందికి దుప్ప‌ట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... పేద‌ల సంక్షేమార్థం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకొచ్చిన మ‌హానేత వైఎస్సార్ అని కొనియాడారు. 

అలాంటి మ‌హానేత తనయుడు వైఎస్ జగన్  పార్టీ త‌ర‌పున పేద‌ల‌కు స‌హాయం చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. అనంత‌రం వైఎస్సార్ సీపీ సేవా స‌మితి నాయ‌కుడు సుధాక‌ర్‌రావు మాట్లాడుతూ... ప్ర‌తి పేద‌వాడికి క‌నీసం తిన‌డానికి తిండి, క‌ట్టుకోవ‌డానికి బ‌ట్ట‌, ఉండ‌డానికి ఇళ్లు త‌ప్ప‌నిస‌రి అని భావించి వైఎస్సార్ వారికి ఎంతో మేలు చేశారని చెప్పారు.
Back to Top