వైయస్‌ జగన్‌ సీఎం అయి ఉంటే హోదా వచ్చేది


గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్‌ తగ్గిందని చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ కలిసి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మహా మాయావి అని విమర్శించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరు గార్చరని ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులో నిర్వహించిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే హోదా వచ్చి ఉండేదన్నారు. మోడీ ప్రధాని అయినా సరే హోదా వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు వర్సెస్‌ ఐదు కోట్ల ఆంధ్రులు అన్నట్లుగా పోరాటం చేద్దామన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరికి వారు విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని, మీ తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాందీ కాబోతుందని మేకపాటి పేర్కొన్నారు. 
 
Back to Top