రాజ్యాంగ వ్యవస్థలు పని చేయకుండా అడ్డుకుంది బాబే


 
– రాజకీయాల్లో బాబుది విలన్‌ పాత్ర
–  దర్యాప్తులు సజావుగా సాగుతున్నాయా?
– ప్రతిపక్ష నేతపై హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలి
 

హైదరాబాద్‌:  పథకం ప్రకారం ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఆయన రాజకీయ పాత్ర కాకుండా..విలన్‌ పాత్ర పోషిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలు పని చేయకుండా అడ్డుకుంది చంద్రబాబే అని పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో చేసిన వ్యాఖ్యలను ధర్మాన తప్పుపట్టారు. బాబుకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. శనివారం ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌పై దాడి వెనుక టీడీపీ పెద్దలు లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని ఏజెన్సీతో విచారణ జరిపించొచ్చు కదా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. దాడి జరిగిన గంటలోనే విచారణ చేయకుండా స్టేట్‌మెంట్లు ఇవ్వొచ్చా అని నిలదీశారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండు చేశారు. డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పేసిన తరువాత, ముఖ్యమంత్రి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారని,  ఇవన్నీ చూస్తుంటే దాడి వెనుక టీడీపీ పెద్దల హస్తముందనిపిస్తోందన్నారు. దీని తరువాత కూడా దర్యాప్తు సంస్థలు ఏం తేలుస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎవర్నీ విచారించకుండా, దర్యాప్తు చేయకుండా పోలీసులు తన అభిప్రాయాలు చెప్పవచ్చా అని మండిపడ్డారు. 

23 మంది ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో లోపరుచుకొని, రాజ్యాంగంలోని చట్టం అమలు చేయకుండా స్పీకర్‌ వ్యవస్థ సక్రమంగా పని చేయకుండా  ముఖ్యమంత్రి ప్రభావితం చేశారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి ఢిల్లీలో మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో గ్రామ పంచాయతీలను కూడా పని చేయకుండా జన్మభూమి కమిటీలకు అధికారాలు కట్టబెట్టింది మీరు కాదా అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో పౌరులు, ప్రతిపక్ష నాయకులు మీ దయాదాక్షిణ్యాలతో బతుకున్నారా? లేదంటే మీరు కైమా కైమా చేయిస్తారా? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే సందేశమని ధర్మాన చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ పాత్ర కాకుండా..చంద్రబాబు విలన్‌ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.

  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top