వైయస్‌ జగన్‌ పేరు టీడీపీకి రామకోటి


నెల్లూరు కేంద్రంగా ప్రభుత్వాల వంచనకు నిరసనగా జూన్‌ 2న దీక్ష
రేపు ఉదయం స్పీకర్‌ను కలవనున్న రాజీనామా చేసిన ఎంపీలు
రాష్ట్ర ప్రజలను పస్తులుంచి.. మహానాడు పేరుతో పండగ చేస్తున్నారు
అధికారపూర్వకంగా చేసిన ఆఖరి మహానాడు ఇదే..
ప్రమాణస్వీకారం రోజు చేసిన ఐదు సంతకాల మాటేంటీ
ఎన్టీఆర్‌ స్ఫూర్తి అంటూ సృజల స్రవంతి పథకాన్ని నీరుగార్చారు
ఓటేసే నాటికి ఉన్న అప్పు తీరిందో లేదో.. డ్వాక్రా మహిళలే చెప్పాలి
39 అంశాల్లో ఏ ఒక్కటైనా చెప్పగలరా?
17 మంది ఎంపీలతో చక్రం తిప్పలేనోడికి 25 మంది అవసరమా?
బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు చంద్రబాబు కట్టాననడం సిగ్గుచేటు
నాలుగేళ్లుగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఎందుకు తీసుకురాలేకపోయావ్‌

హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరంటే టీడీపీకి రామకోటిలా మారడం సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానాడును చంద్రబాబు గ్రామదేవత పండుగలా నిర్వహిస్తూ వైయస్‌ఆర్‌ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని వైయస్‌ఆర్‌ సీపీ మొట్టమొదటగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. తీర్మానం చర్చకు రాని నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పంచపాండవుల్లాంటి ఎంపీలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. రాజీనామా చేసిన ఎంపీలకు పార్లమెంట్‌ నుంచి పిలుపు వచ్చిందని, రేపు ఉదయం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలవనున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి దృçష్ట్యా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరనున్నారని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు నిరసనగా జూన్‌ 2వ తేదీన నెల్లూరు నగర కేంద్రంగా వంచన దీక్ష చేపట్టనున్నట్లు బొత్స చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలను నెరవేర్చే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వివరించారు. ఏప్రిల్‌ 30వ తేదీన విశాఖ కేంద్రంగా వంచనపై గర్జన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మరోసారి రాష్ట్రానికి జరిగిన మోసాన్ని ప్రజానీకానికి వివరించనున్నామన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 2వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరులో దీక్షకు పార్టీ నిర్ణయించింది. దీక్షలో రాజీనామాలు చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, పార్టీ పెద్దలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు అందరూ పాల్గొంటారన్నారు. దీక్షలో అందరూ పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నల్ల షర్ట్, బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని కోరారు. 
 
చంద్రబాబు విజయవాడ కేంద్రంగా నిర్వహించేది మహానాడు అనాలో.. గ్రామ దేవత పండుగ అనాలో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకొని ఎలా అధిగమించాలో చర్చ చేయకుండా వాటిని తలచుకుంటూ కేరింతలు కొడుతున్నారన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలను పస్తులుంచి మహానాడు పేరుతో టీడీపీ నేతలు పిండివంటలు తింటూ పండగ చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి చేసిన మోసాలను ఆయన బట్టబయలు చేశారు. 

చంద్రబాబుకు అధికారపూర్వకంగా నిర్వహించే ఆఖరి మహానాడు ఇదేనని బొత్స అన్నారు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చాక నెరవేర్చాలి. అది విశ్వసనీయ దాన్ని చంద్రబాబు కోల్పోయారు. ఇచ్చిన మాటనే కాకుండా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఐదు సంతకాలు చేశారు.. వాటిని కూడా నెరవేర్చలేకపోయారు. 

– మొదటిది బెల్ట్‌షాపులు రద్దు చేస్తానని సంతకం చేశారు. రద్దు చేశారా.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో..ఆలోచించాలి. 
– తెలుగుదేశం పార్టీ అన్నగారి చేతిలో పుట్టింది.. ఎన్టీఆర్‌ ఆశాజ్యోతి, ఆయనే మాకు స్ఫూర్తి అని చెప్పిన చంద్రబాబు సృజల స్రవంతి పథకంపై రెండో సంతకం పెట్టారు. రూ. 2లకు 20 లీటర్లు నీరు ఇస్తామన్నారు. కనుచూపు మేరల్లో ఆ పథకం కనిపిస్తుందా.. మహానాడు నుంచైనా సమాధానం చెప్పండి.
– డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామని మూడవ సంతకం చేశారు. రూ. 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిన మాట వాస్తవం కాదా..? రాష్ట్ర ఖజానా నుంచి రూ. 12 వేల కోట్లు విడుదల చేసి పూర్తిగా రుణమాఫీ చేశామంటే ఎలా నమ్మాలి. డ్వాక్రా రుణాలు రద్దు అన్నారు.. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానన్నారు.. చంద్రబాబుది అయిపోయింది ఇప్పుడు లోకేష్‌ తయారయ్యాడు. బాబు సుయ్యి అంటే ఈయన అట్టు అంటున్నాడు. ఓటు వేసినప్పుడు మీకున్న అప్పు ఈ రోజుకు తీరిందా.. డ్వాక్రా అక్కచెల్లెమ్మలే చెప్పాలి.
– ఇలాంటి మోసం చేస్తూ కాలం గడుపుతూ.. పైపెచ్చు చంద్రబాబు చెప్పినవే కాకుండా చెప్పనివి 39 అంశాలు నెరవేర్చానని చెబుతున్నారు. మీరు చెప్పిన విషయాల్లోనే ఇన్ని నెరవేర్చనివి చెప్పాం.. చెప్పనివి చేసిన వాటిల్లో ఒక్కటి చెప్పండి.. అన్ని సామాజిక వర్గాలను మోసం, దగా చేశారు. కాపు, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలను మోసం చేశారు. 
– 19 లక్షల ఇళ్లు కడుతున్నామని చెబుతున్నారు. నాలుగేళ్లలో వంద ఇళ్లులు కట్టామని ఒక్క గ్రామం పేరు చెబితే తలదించుకుంటాం. ఏ ఊర్లో వంద ఇల్లులు కడుతున్నారో చెప్పండి.. ఈ రకమైన మోసాలు చేస్తూ ఆత్మస్తుతి పరనింద అంటూ అదే పనిగా మాట్లాడుకుంటూ.. మహానాడులో ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్షనేతను నిందిస్తూ వస్తున్నారు. 
– మళ్లీ 25 ఎంపీలు ఇవ్వమంటున్నారు. 2014లో టీడీపీకి 17 మందిని, ప్రతిపక్షానికి 8 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు. అందులో అందులో ముగ్గురిని తీసుకున్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉండి ఏం చక్రం తిప్పలేని చంద్రబాబు ఈ రోజు మళ్లీ 25 ఎంపీ సీట్లు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. 
– కేంద్రంలో మొన్నటి వరకు ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నారు. ఎందుకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ రాలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు. క్యాబినెట్‌లో ఎందుకు పోరాడలేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం. రాష్ట్రాన్ని పూర్తిగా మంటగలిపి.. ఎక్కడ చూసినా చీకటిమయమైంది.  
– మళ్లీ అధికారం ఇస్తే రాబోయే రోజుల్లో విద్యుత్‌ చార్జీలు పెంచకుండా విధానాలను రూపొందిస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2005లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో  విద్యుత్‌ చార్జీలు పైసా కూడా పెంచమని విధానమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది వాస్తవం కాదా..? ఇది మీకు తెలియదా.. చంద్రబాబూ? 
– రాష్ట్రం విభజన జరిగినప్పుడు మిగులు విద్యుత్‌ ఉన్న ఆంధ్రరాష్ట్రానికి చార్జీలు తగ్గించాల్సిందిపోయి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం. ప్రజలందరికీ చంద్రబాబు వ్యవహార శైలి తెలుసు. చంద్రబాబు దగాకు, వంచనకు ప్రజలు ఎవరూ మోసపోవద్దని అర్జిస్తున్నాం. 
– రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయం, యువత మనస్ఫూర్తి వారి కోసం ఆలోచన చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారు. వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నష్టానికి వ్యతిరేకంగా గర్జన కార్యక్రమం చేస్తున్నాం. 
– శంషాబాద్‌ విమానాశ్రయం నేనే కట్టాను. రింగ్‌రోడ్డుకు నేనే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. అది నాలుకో తాటిమట్టో అర్థం కావడం లేదు.  
– కర్ణాటక ఎన్నికల పరిణామంలో.. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తాపత్రయపడిందో.. దాన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ మారితే రాజీనామా చేసి రావాలనేది మా సిద్ధాంతం. అందుకే ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డిని రాజీనామా చేయించి తీసుకున్నాం. 
– బీజేపీ వైఖరిని అప్రజాస్వామ్యం అంటున్న చంద్రబాబు తెలంగాణలో చేసిందేమిటీ? ఓటుకు కోట్ల కేసులో ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికింది నీ వాయిస్‌ కాదన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించుకోవడం లేదు.. సెక్షన్‌ 8 అని బీరాలు పలికి.. ఎందుకు ఉమ్మడి రాజధానిని వదిలిపెట్టావు. టీఆర్‌ఎస్‌తో ఎందుకు లాలూచీపడి ఆంధ్రరాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టావు. సమాధానం చెప్పు. 
– కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు ఎందుకు ధైర్యంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. ఎందుకు బెంగళూరు వెళ్లి మాట్లాడలేదు.  
– వైయస్‌ఆర్‌ సీపీ మాట ఇచ్చినప్పుడు పీక తెగినా దానికి కట్టుబడి ఉంటుంది. 
 
Back to Top