29న వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీ

మంగళగిరి: ఈనెల 29వ తేదీ సాయంత్రం 5గంటలకు పట్టణంలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కల్యాణ మండపంలో నియోజకవర్గ వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు పట్టణంలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీకి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హాజరు కానున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top