మీకు అధికార‌ముంటే..మాకు ప్ర‌జాబ‌లం ఉంది

నెల్లూరు:  మీకు అధికారం ఉంద‌ని అక్ర‌మాల‌కు పాల్ప‌డితే..మాకు ప్ర‌జా బ‌లం ఉంద‌ని, మీ అరాచ‌కాల‌ను అడ్డుకుంటామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. జిల్లాలోని పెళ్ల‌కూరు మండ‌లంలో అధికార పార్టీ నేత‌ల ఇసుక అక్ర‌మ ర‌వాణాకు అడ్డుప‌డిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడికి పాల్ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని శుక్ర‌వారం కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..టీడీపీ నేత‌ల దాడులు అధిక‌మ‌య్యాయ‌ని మండిప‌డ్డారు. అధికారం ఉంద‌న్న అహంకారంతో దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌తిఘ‌టిస్తామ‌ని హెచ్చ‌రించారు. 

Back to Top