అంబేద్కర్ కు ఘన నివాళి

విజ‌య‌వాడ‌: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి ముగింపు వేడుక‌ల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌నంగా నిర్వ‌హించింది. విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యం నుంచి భారీ ర్యాలీగా త‌ర‌లివెళ్లి జింఖానా గ్రౌండ్ స‌మీపంలోని కందుకూరి క‌ళ్యాణ‌మండ‌పంలో జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని  అంబేద్క‌ర్‌కు నివాళుల‌ర్పించారు. పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగి ర‌మేష్‌, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున‌, ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు గౌత‌మ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముస్త‌ఫా, సురేష్, ర‌క్ష‌ణ‌నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, పార్టీ అధికార ప్రతినిధులు అంబటిరాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగం అప‌హాస్యం కాబ‌డ‌తుంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేశార‌ని, పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి కృషి చేశార‌ని గుర్తు చేశారు. అనంత‌రం అంబేద్క‌ర్ 126వ జ‌యంతి కార్య‌క్ర‌మానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. 
Back to Top