ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తే..రేపే స‌భ‌కు వ‌స్తాం

- వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి
- చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ బ‌హిరంగ లేఖ‌
- రాజ్యాంగ స్ఫూర్తికి స్పీకర్‌ కోడెల తూట్లు
- ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సభ నడపడం సిగ్గులేని చర్య
 
విజయవాడః  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే రేపే శాస‌న స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శాస‌న సభ విలువల్ని కాపాడవలసిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ విలువల్ని మంటగలుపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేర‌కు బుధ‌వారం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ బ‌హిరంగ లేఖ రాసింది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ..  వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయకుండా సభలో కూర్చోపెట్టి సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.  దేశంలోనే ఏ స్పీకర్‌ చేయని విధంగా అన్యాయంగా సభను నడుపుతున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంతవరుకు న్యాయమని ప్రశ్నించారు.  ఒక స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి  అన్నిపార్టీలకు చెంది ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభ్యుల హక్కులను కాపాడాలన్నారు.. స్పీకర్‌ స్థానానికి అవమానం పరిచేవిధంగా కోడెల వ్యవహరిస్తురన్నారు. రాజ్యాంగానికి తూట్లు పోడిచేవిధంగా తెలుగుదేశం జెండాలు కప్పుకుని స్పీకర్‌ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఇటీవల గుంటూరులో  జరిగిన సభలో  స్పీకర్‌ పాల్గొని రాజకీయ ప్రసంగాలు చేసి  స్పీకర్‌కు ఉన్న గౌరవం పొగొట్టరన్నారు. చంద్రబాబు అవసరాలు మీకుంటే స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు భజన చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, రాబోయే తరాలకు శాసనసభ భవిష్యత్‌ దేవాలయంగా ఉండాలన్నారు. శాసనసభలో రాష్ట్ర భవిష్యత్‌ ఉందని, సభ విలువల్ని కాపాడాలని కోరారు.
Back to Top