ఇప్పుడైనా బాబు మనసు మార్చుకోవాలి

ఒంగోలు, 3 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడు ఒక దివాలాకోరు అని, తెలంగాణపై కేబినెట్ నోట్ వచ్చే ఈ సమయంలోనైనా ‌ఆయన మనసు మార్చుకోవాలని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషిచేస్తున్నది ఒకే ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని శివప్రసాదరెడ్డి స్పష్టంచేశారు. పొత్తుల కోసమే ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు పైరవీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మరోసారి ఢిల్లీలో బేరం పెట్టారని బూచేపల్లి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి యాత్రల్లో ఆత్మగౌరవం లేదని, ఉన్నదంతా ఆత్మవంచనే అని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top