వైయస్సార్సీపీ నూతన నియామకాలు

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఆయా పదవులకు నూతన నియామకాలు చేపట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధిగా పూనూరు గౌతంరెడ్డి, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా బాచ‌న చెంచుగ‌ర‌ట‌య్య‌, పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా అనంతపురం జిల్లా అర్బన్ కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్‌లను నియ‌మించారు. అదేవిధంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఆచంట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న ముదునూరి ప్ర‌సాద‌రాజుకు న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 

ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
యూఎస్ య‌న్ఆర్ఐ డాక్టర్ల విభాగం అధ్య‌క్షునిగా డాక్ట‌ర్ న‌లిపిరెడ్డి వాసుదేవ‌రెడ్డి, డాక్టర్స్ విభాగం వ్యవహారాల్ని కాలిఫోర్నియాలో కేశిరెడ్డి రాజశేఖర్ పర్యవేక్షిస్తారు. అలబామా స‌ల‌హా మండ‌లి స‌భ్యులుగా డాక్ట‌ర్ బి. ఆదేశేష రెడ్డి, మిచిగాన్ కు స‌దాశివ‌రెడ్డి,  కాలిఫోర్నియాకు కె. స‌తీష్ ,  టెక్సాస్ కు  ఎస్. రాఘ‌వ‌రెడ్డిని నియ‌మించారు.  ఉప సలహా మండలిలో డాక్ట‌ర్ మోహ‌న్.  ప‌వ‌న్ లను చేర్చారు.  ప‌బ్లిక్ రిలేష‌న్ స‌భ్యుడిగా డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ చిట్టిమ‌ల్లిని నియమంచారు. ఇంఛార్జ్ లుగా  డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ డొంటినేని, డాక్ట‌ర్ పి. ప‌వ‌న్ , డాక్ట‌ర్. మ‌ల్లారెడ్డి , డాక్ట‌ర్ బాల్‌సోద‌మ్‌, డాక్ట‌ర్ ల‌త‌మంజ‌రి మైలా, డాక్ట‌ర్ స‌మంతా క‌ల‌కుర్తి, డాక్ట‌ర్ శృతి ఎల్ఎఎం, డాక్ట‌ర్ వేణుగోపాల్ న‌లిక్‌లను నియ‌మించారు. 

Back to Top