పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు ఫ్లకార్డులు పట్టుకొని ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఎంపీలు విమర్శించారు. ప్యాకేజీకి ఆశపడి హోదాను గాలికొదిలేశారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ..అంటే తెలుగు డ్రామా పార్టీగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ లోపల ప్రశ్నించడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top