ప్రత్యేక హోదా సాధనకు నిరంతర పోరాటం

ఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. విభజన హామీలు అమలు చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. టీడీపీ మంత్రుల రాజీనామాలు డ్రామా అన్నారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా కొనసాగడం అర్ధరహితమన్నారు. విశ్వాసం కోల్పోయిన తరువాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. 
 
Back to Top