ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. అలాగే పార్లమెంట్‌లోని స్పీకర్‌పోడియం వద్దకు చేరుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రత్యేక హోదాపై సభలో చర్చకు అనుమతించాలని పట్టుపట్టారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు..ప్రత్యేక హోదా కావాలని నినదాలు చేశారు. <br/>