చంద్రబాబు పార్థీనియం కలుపు మొక్కలాంటివాడు

అమరావతి: తెలంగాణా ప్రజానీయం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ‘పార్థీనియం’ కలుపు మొక్కలాంటివాడు. ఈ కబళించే కలుపు మొక్క పంటలను నాశనం చేస్తుంది. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారు. తెలంగాణా ప్రజానీకం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు ‘పార్థీనియం’ లైఫ్‌ రాజకీయంగా ముగిసినట్టే. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ ఒక్క విషయం బాగా అర్థం అయింది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఏపీలో బాబు దోపిడీ నుంచి పుట్టిందేనని. అవినీతి బాబు ఒక్క కేసులో దొరికినందుకు, ఏపీ ప్రజలు చెల్లించుకుంటన్న భారీ మూల్యాల్లో ఇదొకటని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top