ఈవీఎంలు ట్యాంపర్‌ చేసి బాబు అధికారంలోకి వచ్చారున్యూఢిల్లీ:  2014 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపర్‌ చేసి అధికారంలోకి వచ్చార ని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో జత కట్టినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడలేదన్నారు. ఈవీఎంలపై చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు సభలో హోదా కోసం పోరాటం చేయడం లేదని తెలిపారు. కేసుల భయంతో సుజనా, సీఎం రమేష్‌ పారిపోతున్నారని పేర్కొన్నారు.  తుపానుతో ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబుకి ప్రమాణ స్వీకారాలు ముఖ్యమయ్యాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు లేరని తెలిసి తుపాను వెనక్కి వెళ్లిపోయిందన్నారు. డాష్‌ బోర్డు అనే పదం తప్ప చంద్రబాబుకు ఏం తెలీదని ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top