హత్యాయత్నంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి..

వైయస్‌ జగన్‌ హత్యాయత్నంలో కర్త,కర్మ,క్రియ చంద్రబాబే..
కేంద్రం నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి
న్యూఢిల్లీః వైయ‌స్ జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌కు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయ‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపిస్తే ఆ వివ‌రాలు అంద‌జేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నంలో కర్త,కర్మ,క్రియ,సూత్రధారుడు,పాత్రదారులలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రధాన కుట్రధారుల్లో  డీజీపీ ఠాకూర్,  కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాస రావు, నటుడు శివాజీ, రెస్టారెంట్‌ యాజమాని హర్షవర్థన్‌లు ఉన్నారన్నారు. హత్యాయత్నంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల  ప్రమేయం లేకపోతే రాష్ట్రపతి వద్దకు వచ్చి స్వయంగా విచారణ చేయించామని అడిగేవారన్నారు. ఈ కుట్రదారులు సమావేశం కూడా జరిగిందని, అయితే వాటిని తాము రాష్ట్ర పోలీసు అదికారులకు ఇవ్వబోమని చెప్పారు.కుట్రదారులు ఇప్పుడు కాకపోయినా, ఎన్నికల తర్వాత అయినా జైలుకు వెళ్లక తప్పదని ఆయన అన్నారు.జగన్ పై హత్యయాత్నం జరిగిన కాసేపటికే డిజిపి, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల వివరాలను రాష్ట్రపతికి ఇచ్చామని ఆయన చెప్పారు. కోర్టు,రాష్ట్రపతిల ఉత్తర్వులు ద్వారా కాని విచారణ చేయిస్తే నిష్పాక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎలక్షన్‌ అయిన తర్వాత నిజాలు బయటకు వస్తాయన్నారు. హత్యాయత్నంలో ఆరోపణలు ఉన్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎలా జత కడుతుందని ప్రశ్నించారు.
Back to Top