స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు విఫలం


అమరావతి:  స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి స్వైన్‌ఫ్లూపై ట్వీట్‌ చేశారు. గడిచిన నెలలో కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మరణించారని గుర్తు చేశారు. స్వైన్‌ఫ్లూ మరణాలకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని ఆయన డిమాండు చేశారు. 
 
Back to Top