చంద్ర‌బాబుది ఏ పార్టీతోనైనా లాలూచీ పడే వ్యక్తిత్వం

 

 విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌న‌ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా లాలూచీ పడే వ్యక్తిత్వమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సోమవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆస్తులు పెంచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్న గజదొంగ చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Back to Top