వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్‌​ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్‌ నేతలతో విస్తృతంగా చర్చించారు. పార్టీ సీనియర్‌ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత ఇవాళ అభ్యర్థులను ఖరారు చేశారు.

ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు

1. ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి జిల్లా-ఏలూరు)
2. గంగుల ప్రభాకర్‌ రెడ్డి (కర్నూలు జిల్లా-ఆళ్లగడ్డ)

మరోవైపు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఎంవీఎస్‌ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు తదితరులు ఇవాళ వైయస్‌ జగన్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాయలసీమ ఈస్ట్‌ గ్రాడ్యుయేట్‌  నియోజకవర్గంలో పీడీఎఫ్‌ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులురెడ్డి, టీచర్స్‌ నియోజకవర్గంలో విటపు బాలసుబ్రహ్మణ్యానికి వైయస్‌ జగన్‌ మద్దతు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో అజయ్‌ శర్మకు మద్దతు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ఈ సందర్భంగా మూడు నియోజకవర్గాల్లో పీడీఎఫ్‌ అభ్యర్థుల విజయానికి పార్టీ నేతలు కృషి చేయాలన్నారు.
Back to Top