స్పీకర్ ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్) శాసనసభ
ప్రాంగణంలో స్పీకర్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి,
విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. ఫిరాయింపుల అంశాన్ని చర్చించారు. ఫిరాయించిన 16 మంది
మీద మరోసారి ఫిర్యాదు చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ లో చేరిన వారి
మీద అనర్హత వేటు వేయాలని విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్
లో జరగుతున్న అరాచక పోకడలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వివరించారు. పార్టీలు
ఫిరాయించటం అన్నది ప్రజల్ని వంచించటమే అని అభివర్ణించారు. 

Back to Top