నమ్మకద్రోహి, వెన్నుపోటు దారుడు చంద్రబాబు దగ్గర పెరిగిన వారే..ప్యాకేజీల కోసం ఆ పార్టీలో చేరారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలంతా వారి ఇంటి అభివృద్ధి కోసం పోయారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని దుయ్యబట్టారు. వారికి ఏమాత్రం సిగ్గూ, చీము, నెత్తురు ఉన్నా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. <br/>వైఎస్ జగన్ ను చూసి ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించారు తప్ప వాళ్ల మొహాలను చూసి కాదన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కేసీఆర్ పశువుల్లా కొంటున్నాడని మాట్లాడిన చంద్రబాబు...ఇక్కడ చేస్తున్నదేంటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.