ప్రొద్దుటూరు ఘటనపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్‌: ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో విధ్వంసానికి పాల్పడ్డ టీడీపీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాషాలు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన అధికారిని ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా తీరు, రెవెన్యూ, పోలీసు అధికారులు శైలిపై ఫిర్యాదు చేశారు. విధ్వంసానికి పాల్పడ్డ టీడీపీ కౌన్సిలర్లపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు చెప్పారు.

Back to Top