<br/><br/><strong>- రోడ్డు లైఫ్ ట్యాక్స్ చెల్లించిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే</strong><strong>- ఆటో కార్మికుల హర్షం</strong>వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటోంది. ఆటో కార్మికులకు అండగా ఉంటామని ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో కార్మికుడికి ఏటా రూ.10 వేలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. అధినేత బాటలోనే పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నడుస్తున్నారు. ఆటోకార్మికుల గూడ్స్ వెహికల్స్ కు రోడ్ లైఫ్ టాక్స్ రూ. 21లక్షలు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్నారు. డీజిల్ ధరలు విఫరీతంగా పెరిగిన నేపథ్యంలో బతుకు బండి సాగడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆటో కార్మికుల బాధలను గమనించిన శివప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 200 మంది ఆటో కార్మికులకు లైఫ్ టాక్స్ చెల్లించారు. ఇటీవల పట్టణంలో ‘హర్ దిల్ మే వైయస్ఆర్ ’ కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిన మోసాలను వివరించారు. మైనా రిటీలపై అభిమానంతో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయంటే అది కేవలం మహానేత చలువే అని వివరించారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక క్వారీ మంజూరు చేసే వరకూ పోరును కొనసాగిస్తామని వారం రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆందోళన చేపట్టారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలిచిన శివప్రసాద్‌రెడ్డి సేవలకు అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.