కర్నూల్ : ఏపీలో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. నిన్నటి దాక బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసిన వ్యక్తి.. నేడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. దేశంలో చరిత్ర హీన చక్రవర్తి చంద్రబాబేన్నారు. కాంగ్రెస్ మహాకూటమితో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.ఏపీలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతో పశువులను కొన్నట్లు కొన్నది నీవు కాదా బాబు అంటూ ఐజయ్య ప్రశ్నించారు. స్పీకర్ స్థానాన్ని కూడా అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు.